← Back to news

నరసాపురం పురపోరుకు ఏర్పాట్లు

By Bala· 1d ago
నరసాపురం పురపోరుకు ఏర్పాట్లు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీలో 36 వార్డులకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మొత్తం 71 పోలింగ్ కేంద్రాలుండగా 10 సమస్యాత్మక, మరో 10 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఓటర్లు 46,996 మంది కాగా పురుషులు 22,389, మహిళలు 24,606 మంది. 677 మంది సిబ్బందిని నియమించారు. నామినేషన్ల కోసం మున్సిపల్ కార్యాలయంలో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

More in Local