← Back to news

బధిర ఐటీఐలో విద్యార్థుల కష్టాలు

By Nani Eluri· 20h ago· X

AP: తిరుపతిలోని టీటీడీ బధిర ఐటీఐలో సిబ్బంది తమతో పనులు చేయిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేపి వంట, శుభ్రం చేసే పనులు చేయిస్తున్నారని, చేయకపోతే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాత్‌రూమ్ శుభ్రం చేస్తూ ఓ విద్యార్థి కంటికి గాయమైనట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌కు చెప్పినా స్పందన లేకపోవడంతో.. తమ సమస్యలు పరిష్కరించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ జేఈవోను కోరారు.

More in AP