← Back to news

కాంట్రాక్ట్ ఉద్యోగుల రిలే దీక్షలు.. న్యాయం కావాలి!

By Prasad Sode· 1h ago· Kalleru, Chinturu, Polavaram
కాంట్రాక్ట్ ఉద్యోగుల రిలే దీక్షలు.. న్యాయం కావాలి!

ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ ఎదుట వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. చింతూరు డివిజన్ పరిధిలోని 11 పీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీల నుంచి సుమారు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు 100 శాతం గ్రాస్ సాలరీ ఇవ్వాలని వీరి ప్రధాన డిమాండ్లు. ఐదుసార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేదన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల రిలే దీక్షలు.. న్యాయం కావాలి!

More in Local