గుట్టుగా డ్రగ్స్ దందా!

TG: హైదరాబాద్‌లో గంజాయి, హషీష్ ఆయిల్, అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల సరఫరాపై పోలీసులు నిఘా పెంచుతున్నారు. వరుస దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నా.. అక్రమ సరఫరా పూర్తిగా ఆగడం లేదు. ముఖ్యంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు మత్తు పదార్థాలను చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుట్కా, పాన్ మసాలా వంటి వాటిలోనూ మత్తు పదార్థాలు కలిపి విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


