తాళాలు పగులగొట్టి చోరీ.. నిందితులు అరెస్ట్

TG: ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసును ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పోలీసులు ఛేదించారు. బజార్‌హత్నూర్ మండలం గిర్జై గ్రామానికి చెందిన డ్రైవర్ పెండూర్ మధుకర్ (21)ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన గుడిహత్నూర్‌కు చెందిన స్వర్ణకారుడు దహలే సంతోష్ (46)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.85,600 విలువైన బంగారు, వెండి ఆభరణాలను వంద శాతం రికవరీ చేసినట్లు ఎస్సై ఎల్. శ్రీకాంత్ తెలిపారు.
