పోలీసుల చేతికి చిక్కిన నకిలీ దందా!

TG: హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి రీజియన్‌లో పోలీసులు జరిపిన ఫుడ్ సేఫ్టీ రైడ్స్‌లో భారీగా కల్తీ పదార్థాలు బయటపడ్డాయి. హయత్‌నగర్, అల్వాల్, దుండిగల్‌లలోని ప్రాసెసింగ్ యూనిట్లపై దాడులు చేసి 730 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 500 కిలోల నకిలీ పనీర్, భారీగా స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం మెటీరియల్స్, ఫుడ్ కలర్స్, కెమికల్స్ వాడుతూ పబ్లిక్ హెల్త్‌తో ఆటలాడుతున్న ఆకుల శివయ్యతో పాటు పలువురిని మల్కాజ్‌గిరి స్పెషల్ టీమ్స్ అరెస్ట్ చేశాయి.



