“We are Gen Z”.. లడఖ్‌లో టూరిస్ట్ వైరల్
లడఖ్‌లో ట్రాఫిక్ ఆపడంతో ఐదు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చిందని ఓ మహిళా టూరిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. మినిమార్గ్ చెక్‌పోస్ట్ దగ్గర భద్రతా సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగుతూ “We are Gen Z.. ఈ నాన్సెన్స్ భరించం” అంటూ మాట్లాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియోపై సోషల్ మీడియాలో కొందరు ఆమెను సమర్థిస్తుంటే, మరికొందరు ఆమె ప్రవర్తనను తప్పుపడుతున్నారు. అయితే ఘటనపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఐదు గంటల వెయిటింగ్‌తో మొదలైన ఈ గొడవ, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.


