అనంత నామినేషన్ కేంద్రాల తనిఖీ

అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ ఆనంద్ గురువారం పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయం, ఆర్ట్స్ కళాశాలలోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను చూశారు. శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉంచాలని డీఎస్పీకి సూచించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.



