డబ్బు కంటే నిజాయితీ గొప్పదని చాటిన స్వీపర్

AP: పోగొట్టుకున్న పర్సును భక్తురాలికి తిరిగి అందజేసి మఠం స్వీపర్ రాముడు నిజాయితీ చాటుకున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సావిత్రమ్మ దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ఆమె తన పర్సును మఠం ప్రాంగణంలో పోగొట్టుకున్నారు. అందులో రూ.2,500 నగదు ఉన్నట్లు తెలిపారు. పర్సు మఠంలో పనిచేస్తున్న స్వీపర్ రాముడికి దొరకడంతో వెంటనే మఠం యాజమాన్యానికి అప్పగించారు. అనంతరం యాజమాన్యం సమక్షంలో పర్సును, అందులోని నగదును సావిత్రమ్మకు రాముడు తిరిగి అందజేశారు.



