మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా మండలనేని పద్మావతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ స్థానానికి కూటమి అభ్యర్థిగా మండలనేని పద్మావతి బరిలోకి దిగనున్నారు. ఆమె పేరును కూటమి అధిష్ఠానం ఖరారు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మండలనేని సుబ్బారావు సతీమణిగా, చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకుడు మండలనేని చరణ్ తేజ తల్లిగా పద్మావతికి రాజకీయంగా గుర్తింపు ఉంది. చైర్మన్ అభ్యర్థిగా ఆమె ఎంపిక కావడంతో మున్సిపాలిటీ రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.



