షెన్‌జెన్‌లో రోబోల బాక్సింగ్ ఫైట్ నైట్
చైనాలోని షెన్‌జెన్ నగరం సరికొత్త రికార్డుకు వేదికైంది. 'ఇంజన్ ఏఐ' (EngineAI) సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోల బాక్సింగ్ టోర్నమెంట్ (URKL) ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 32 అంతర్జాతీయ జట్లు తమ T800 రోబోలతో రింగులో తలపడ్డాయి. ఈ పోటీల్లో రోబోలు బ్రూస్ లీ శైలిలో పర్ఫెక్ట్ లో-కిక్స్, పంచ్‌లతో అలరించాయి. కేవలం వినోదం కోసమే కాకుండా, విపత్కర పరిస్థితుల్లో రోబోల సమతుల్యత, కదలిక,నియంత్రణ సామర్ధ్యాలను టెస్ట్ చేసి , వాటి టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి ఈ రౌండ్-ది-క్లాక్ ఫైట్ నైట్‌ను పరిశోధకులు నిర్వహిస్తున్నారు.



