← Back to news

ఆత్మహత్యాయత్నం ఘటనలో ముగ్గురికి రిమాండ్

By @ Alam· 1d ago· Bhadradri Kothagudem
ఆత్మహత్యాయత్నం ఘటనలో ముగ్గురికి రిమాండ్

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు PS ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, రహదారిపై బైఠాయించి ప్రజా రాకపోకలకు అంతరాయం కలిగించిన బండి వెంకటేశ్వర్లు, మద్దెల గోపి, బండి రాజయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్ విధించినట్లు తెలిపారు. సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని, రాకపోకలను అడ్డుకోవడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More in Local