రాత్రి వేళ రోడ్లపై పశువులు.. ప్రమాదాల ముప్పు

TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రోడ్లపై పశువుల సంచారం ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. 5ఇంక్లైన్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు రాత్రి వేళల్లో పశువులు రహదారులపై సంచరిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ రోడ్లపై పశువుల కారణంగా ప్రమాదాలు జరిగి పలువురు గాయపడటంతో పాటు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు.




