రాంపూర్లో బోనాల సందడి.. దుర్గమ్మ వైభవం!
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామంలో దుర్గాదేవి బోనాల పండుగ ఘనంగా జరిగింది. సర్పంచ్ చిన్నోళ్ళ విజయలక్ష్మి, ప్రవీణ్ కుమార్ దంపతుల నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. మహిళలు, ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్థానిక ఆలయాలను దర్శించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో వేడుకలు కన్నులపండువగా సాగాయి.



