మెడల్ లిస్ట్ పూర్తయింది: మీరాబాయి చాను

2026 ఆసియా గేమ్స్ లో రజత పతకం గెలవడం పట్ల వెయిట్ లిఫ్టింగ్ సంచలనం మీరాబాయి చాను సంతోషం వ్యక్తం చేసింది. 'నా కెరీర్లో ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్, కామన్వెల్త్ గేమ్స్ లలో పతకాలు వచ్చాయి. ఆసియా క్రీడల పతకం ఒక్కటే మిగిలిపోయింది. ఈ రోజుతో నా మెడల్ లిస్ట్ పూర్తయింది. నా జీవితం ధన్యమైంది. ఈ పతకం కోసం ఎంతో కాలంగా ఎదురుచూశాను' అని వెల్లడించింది.


