WAPL 2026: రెండు మ్యాచ్లు రద్దు

మంగళగిరి వేదికగా జరుగుతున్న WAPL 2026లో వర్షం కారణంగా ఇవాళ జరగాల్సిన రెండు మ్యాచ్లు పూర్తిగా రద్దయ్యాయి. నిరంతరాయంగా కురిసిన వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారింది. దీంతో అమరావతి VS వైజాగ్, గోదావరి VS రాయలసీమ మ్యాచ్లను ఒక్క బంతి కూడా పడకుండానే అంపైర్లు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు జట్లకు తలో ఒక పాయింట్ లభించింది.


