← Back to news

కర్నూలు మేయర్ బరిలో విజయప్రత్యూష

By ChiyaanVedha· 8h ago· Kurnool
కర్నూలు మేయర్ బరిలో విజయప్రత్యూష

కర్నూలు నగర మేయర్ అభ్యర్థిగా టీడీపీ విజయప్రత్యూష పేరును ఖరారు చేసింది. మేయర్ పదవి SC రిజర్వేషన్‌కు కేటాయించడంతో ఆమెను ఎంపిక చేసింది. విజయప్రత్యూష కుటుంబం సుదీర్ఘకాలంగా టీడీపీకి సేవలందిస్తోంది. గతంలో ఆమె 52వ వార్డు కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్ఠానం ఆమె పేరును ఖరారు చేసింది. విజయప్రత్యూష నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

More in Local