భారత్ మరో కీలక మిసైల్ పరీక్ష సక్సెస్! 🚀

ఒడిశాలోని చాందీపూర్ నుంచి భారత్ ‘అగ్ని-IV’ బాలిస్టిక్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది! 🚀🇮🇳 దాదాపు 4,000 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ మిసైల్‌కు సంబంధించిన ఆపరేషనల్, టెక్నికల్ సామర్థ్యాలను చెక్ చేసేందుకు ఈ ట్రయల్ నిర్వహించారు. పరీక్ష సమయంలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను మిసైల్ విజయవంతంగా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని-IV భారత్‌కు చెందిన ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ మిసైల్. దేశ రక్షణ సామర్థ్యాన్ని పరీక్షించడంలో ఈ ట్రయల్ మరో కీలక అడుగుగా నిలిచింది.



