← Back to news

BRSకు రాజీనామా.. మాజీ సర్పంచ్ కాంగ్రెస్‌లో

By Ramesh Ch· 3h ago· Narsampet (Ct), Narsampet, Warangal
BRSకు రాజీనామా.. మాజీ సర్పంచ్ కాంగ్రెస్‌లో

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రంగాపురం గ్రామ మాజీ సర్పంచ్ గొనె రాంబాబు BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలోత్ చరణ్‌సింగ్, పీఏసీఎస్ డైరెక్టర్ చార్ల శివారెడ్డి, రంగాపురం సర్పంచ్ ఓరుగంటి మాధురిరాజు తదితరులు పాల్గొన్నారు.

More in Local