← Back to news

శ్రీకాళహస్తిలో దొరికిన చైన్ స్నాచర్

By Jagadish· 4h ago
శ్రీకాళహస్తిలో దొరికిన చైన్ స్నాచర్

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం రాత్రి ఘటన జరిగింది. ఓ యువతి మెడలోని బంగారు గొలుసును దుండగుడు లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆమె ఒంటరిగా ఇంటికి వెళ్తుండగా అతను వెంబడించాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. స్థానికుల అప్రమత్తతతో దొంగ పట్టుబడటం ఊరట కలిగించింది.

More in Local