వినాయక విగ్రహం కోసం నీళ్లు తీసుకెళ్తూ.. యువకుడు మృతి!

కాకినాడ జిల్లా పిరాపురంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు కోనేరు నుంచి నీళ్లు తీసుకెళ్తూ ఓ యువకుడు మృతి చెందాడు. కండ్రాడ గ్రామానికి చెందిన ధనకొండ సాయి (22) ఆదివారం రాత్రి విగ్రహం ఏర్పాట్లలో పాల్గొన్నాడు. విగ్రహ ప్రతిష్టకు ముందు పవిత్ర జలాల కోసం సోమవారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి పాదగయకు వెళ్లాడు. అక్కడ కోనేరులో నీళ్లు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. అతనిని వెలికితీసేటప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.
