సింహాచలం భూ వివాదం: జంక్షన్‌లో రైతుల ధర్నా

విశాఖ జిల్లా పెందుర్తి, చినగదిలి మండలాల రైతులు, స్థానికులు సింహాచలం దేవస్థానంతో ఉన్న భూ వివాదాన్ని పరిష్కరించాలని సింహాచలం జంక్షన్‌లో ధర్నా చేశారు. 25 ఏళ్లుగా ఈ సమస్య నడుస్తున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు ఉన్నా దేవస్థానానికి పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తక్షణమే ఈ ఇష్యూని సాల్వ్ చేయకపోతే రాబోయే GVMC ఎలక్షన్లలో సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
