← Back to news

జిల్లాలో 5,774 కేసులు పరిష్కారం

By DK· 2d ago
జిల్లాలో  5,774 కేసులు పరిష్కారం

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 5,774 కేసులు పరిష్కారమయ్యాయి. కొత్తగూడెంలో అత్యధికంగా 3,384 కేసులు, భద్రాచలంలో 1,121, ఇల్లందులో 602, మణుగూరులో 422, దమ్మపేటలో 245 కేసులు పరిష్కరించారు. కొత్తగూడెంలో 8 మోటార్ వాహన ప్రమాద కేసులను రూ.37.50 లక్షలకు పరిష్కరించారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు, పీఎల్‌సీ, సైబర్ క్రైమ్, టెలిఫోన్, ట్రాఫిక్ చలాన్ కేసులను పరిష్కరించారు. పరస్పర అంగీకారంతో కేసులు త్వరగా పరిష్కారం కావడంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు.

More in Local