పింఛన్ల దందా!

TG: హనుమకొండ జిల్లాలో పింఛన్ల కోసం దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. పింఛన్ ఇప్పిస్తామని దళారులు 10 వేల నుంచి 20 వేల వరకు డబ్బులు అడుగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అర్హత లేని వారికి పింఛన్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. తిరస్కరించిన దరఖాస్తులను ఒత్తిళ్లతో జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. నకిలీ సదరం సర్టిఫికెట్లపైనా కంప్లైంట్లు ఉన్నాయి. అధికారులు విచారించి అర్హులకే పింఛన్లు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

