ఏయ్ నిద్రపో.. మొబైల్ చూస్తే.. కిక్!
రాత్రైతే చాలు, మొబైల్ చూస్తూ, నిద్ర పోవట్లేదు చాలా మంది. ప్రపంచానికి ఇదో సమస్యైపోయింది. ఎక్కువ మంది రీల్స్ చూస్తూ గడిపేస్తున్నారు. నిద్ర సరిపోక, హెల్త్ దెబ్బతింటోంది. అందుకే.. రాత్రిళ్లు బెడ్‌పై మొబైల్ చూసేవారికి బాక్సింక్ కిక్ ఇచ్చైనా సరే.. మొబైల్ లాగేసుకొనే రోబో హ్యాండ్ ఉండాలనే వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇలాంటి మెషిన్ నిజంగా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మీకు ఏమనిపిస్తోంది? ఇలాంటిది రావాలనిపిస్తోందా? కామెంట్ చెయ్యండి!
