← Back to news

సంక్షేమమే మా టార్గెట్ : వినయ్‌రెడ్డి

By naveed mohd· 3h ago· నందిపేట్‌

TG : సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి అన్నారు. నందిపేట్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత ఉద్యోగాలు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటివి అమలు చేస్తున్నామని చెప్పారు. 15 లక్షల కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చి సన్నబియ్యం అందిస్తున్నామని, రూ.21 వేల కోట్ల రుణమాఫీతో పాటు సన్నబియ్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని తెలిపారు.

More in Local