పుట్టపర్తి నామినేషన్ కేంద్రాల తనిఖీ

సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ స్థానిక ఎన్నికల నామినేషన్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ గురువారం పరిశీలించారు. చిన్నపల్లి ఉన్నత పాఠశాలలో 1 నుంచి 12 వార్డులకు, ఎనుములపల్లిలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో 13 నుంచి 28 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 16 నుంచి 19 వరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాఖలు చేయవచ్చు.



