రాజోలు కోర్టులో మెగా లోక్ అదాలత్.. 475 కేసులు పరిష్కారం!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కోర్టులో మెగా జాతీయ లోక్ అదాలత్ జరిగింది. రెండు బెంచ్‌లు ఏర్పాటు చేసి పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఇరుపక్షాల అంగీకారంతో కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యాయి. మొదటి బెంచ్‌కు సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నప్రసాద్, రెండో బెంచ్‌కు జూనియర్ సివిల్ జడ్జి కె. హిమబిందు అధ్యక్షత వహించారు. ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 475 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.1 కోటి 27 లక్షల 59 వేలకుపైగా విలువైన లావాదేవీలకు పరిష్కారం లభించింది.
