← Back to news

త్వరలో రాష్ట్రానికి 750 కొత్త బస్సులు

By Anusha· 10 Oct 2026
త్వరలో రాష్ట్రానికి 750 కొత్త బస్సులు

ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో 750 కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రానున్నాయి. ఇకపై కొనుగోలు చేసే బస్సులన్నీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులేనని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, స్త్రీశక్తి బస్సులు కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుగా మారనున్నాయని చెప్పారు. ప్రొద్దుటూరులో కొత్త ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఆర్టీసీలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టామని, ఉద్యోగుల అలవెన్సులు పెంచామని తెలిపారు.

More in AP