← Back to news

గణనాథుడి కృపతో సమృద్ధిగా వర్షాలు కురవాలి: భాస్కరరావు

By DK· 1d ago
గణనాథుడి కృపతో సమృద్ధిగా వర్షాలు కురవాలి: భాస్కరరావు

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని ఇందిరానగర్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గణేష్ పూజా కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కరరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి కృపతో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు అభివృద్ధి చెందాలని భగవంతుడిని కోరుకున్నట్లు చెప్పారు.

More in Local