ECపై కేటీఆర్ కీలక కామెంట్స్

TG: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం ఏకపక్షంగా మారుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటే, ఈసీని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపు, పునరుద్ధరణ నిర్ణయాలపై అనుమానాలు ఉంటే ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.



