'రామాయణ' కొత్త పోస్టర్ వచ్చేసింది..

బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ తీస్తున్న 'రామాయణ' మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రావణుడి రోల్ చేస్తున్న యష్‌పై ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యష్ లేకుండా 'రామాయణ' జర్నీ అసంపూర్ణమని, ఆయన ఈ ప్రాజెక్ట్‌కి బ్యాక్‌బోన్‌లా నిలిచారని చెప్పారు. ఈ మూవీ పార్ట్-1 2026 దీపావళికి థియేటర్లలోకి రానుంది.


