పోలీసుల చిత్రహింసల వల్లే దళితుడు చీకటి గోపి మృతి..!

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన దళిత యువకుడు చీకటి గోపి (29) మృతి కలకలం రేపుతోంది. పోలీసుల అక్రమ నిర్బంధం, చిత్రహింసల వల్లే ఆయన చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గోపి భార్య జ్యోతి మాట్లాడుతూ.. తాడికొండ పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 25న ఓ కేసు విషయంలో గోపిని తాడికొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి 27న పంపించారని, రెండు రోజులు అక్రమంగా స్టేషన్‌లో ఉంచారని MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ ఆరోపించారు.
