కరీంనగర్లో గంజాయి చాక్లెట్ల కలకలం

కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ నగరంలోని టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద తనిఖీలు నిర్వహించి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన లింగంపల్లి నరేష్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు 908 గ్రాములుగా గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు.


