← Back to news

'మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం'

By Ramesh Ch· 1d ago· Warangal
'మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం'

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో ₹10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘం భవనానికి నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, సంఘాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

More in Local