← Back to news

ఎక్సైజ్ కమిషనర్‌గా ఫేక్ ఎంట్రీ..

By Nani Eluri· 2h ago· Ndtv
ఎక్సైజ్ కమిషనర్‌గా ఫేక్ ఎంట్రీ..

గోవాలో గవర్నమెంట్ జాబ్ కోసం 27 లక్షల రూపాయలు ఇచ్చిన మనోజ్ తలేకర్ చివరికి పోలీసులకు చిక్కాడు. గోవా ఎక్సైజ్ కమిషనర్‌గా నియమితుడైనట్లు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌తో ఆఫీసుకు వెళ్లి, ఆ కుర్చీలో కూర్చున్నాడు. అయితే, అలాంటి ఆర్డర్ ఏదీ జారీ కాలేదని అధికారులు చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. అజిత్ శంఖ్‌వాల్కర్ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లు మనోజ్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి, అజిత్ కోసం వెతుకుతున్నారు.

More in National