ఆదోనిలో ఓటర్ల జాబితా విడుదల.. 1.76 లక్షల మంది ఓటర్లు!

కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజలకు కీలక అప్డేట్. మున్సిపల్ కమిషనర్ నయూమ్ అహ్మద్ సోమవారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. పట్టణ ప్రజాసంఘం పరిధిలోని 52 వార్డుల్లో మొత్తం 1,76,676 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్టీ 1,620, ఎస్సీ 25,181, బీసీ 1,34,802, ఇతరులు 15,073 ఓటర్లు ఉన్నారు. జాబితాలను ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు జాబితాలను పరిశీలించి అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించవచ్చు. మున్సిపల్ కమిషనర్ బాలమద్దయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
