← Back to news

దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన జగ్గారెడ్డి

By DK· 1d ago· సంగారెడ్డి జిల్లా
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. గురువారం TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. రావణ దహనం కోసం సిద్ధం చేస్తున్న 55 అడుగుల రావణాసురుడి బొమ్మతో పాటు బాణసంచా ప్రదర్శన స్థలాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. రావణ దహనం, బాణసంచా ప్రదర్శన, ప్రముఖ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహించనున్నారు.

More in Local