పిల్లలతో ఇలా మాట్లాడితే లెర్నింగ్ బెటర్

పిల్లలతో ఆడేటప్పుడు పేరెంట్స్ అడిగే ప్రశ్నలే వారి లెర్నింగ్‌పై ప్రభావం చూపుతాయట! అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీ పరిశోధకులు 3 నుంచి 6 ఏళ్ల ఏజ్ ఉన్న.. 72 మంది పిల్లలపై స్టడీ చేశారు. పేరెంట్స్ ప్రశ్నలు అడుగుతూ, పిల్లలను గైడ్ చేసినప్పుడు వారు ఆటలోనే కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడంలోనూ బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించారు. ముఖ్యంగా సమాధానం చెప్పమని అడిగే ప్రశ్నలు పిల్లల్లో లెర్నింగ్ స్కిల్స్ పెంచుతోందని స్టడీ తెలిపింది.



