మీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారా.. మంచిదే!

పిల్లలు బాగా అల్లరి చెయ్యడం మంచి సంకేతమని సైకాలజీ స్టడీస్ చెబుతున్నాయి. ఎక్కువ అల్లరి చేసే పిల్లల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. అందరితో బాగా కలవగలరు. ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. బ్రెయిన్ షార్ప్ అవుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. ఇలాంటి పిల్లలు రిస్క్‌ని ఫేస్ చెయ్యగలరు. కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. సమస్యలకు సొల్యూషన్ వెతకగలరు. కాబట్టి అల్లరిని ఆపకుండా పాజిటివ్ యాంగిల్‌లో చూడటం మంచిదే.



