గణేష్ ఉత్సవాలపై సీపీ కీలక ఆదేశాలు

TG: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నిర్వాహకులకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద CCTV కెమెరాలు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. DJలు, బలవంతపు చందాలు, జూదం, మద్యం సేవించడం, సోషల్ మీడియాలో పుకార్ల ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




