జీవో 97 రద్దు.. విద్యార్థుల నిరసన!

గద్వాల జిల్లా గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జీవో 97 రద్దు డిమాండ్తో రోడ్డెక్కారు. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 97 వల్ల తమ విద్యా భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. కళాశాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. జీవో 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.



