← Back to news

కాంగ్రెస్‌లో తగ్గని విభేదాలు!

By A.Ajay· 1d ago
కాంగ్రెస్‌లో తగ్గని విభేదాలు!

TG: వరంగల్‌ ఈస్ట్ MLA, మాజీ మంత్రి కొండా సురేఖ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. నిన్న వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సురేఖ హాజరుకాలేదు. MLC ఎన్నికల సన్నాహక సమావేశానికీ ఆమె దూరంగా ఉన్నారు. మరోవైపు, ఆమె అనుచరులు కొన్ని పార్టీ కార్యక్రమాలను విడిగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌లో విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయనే చర్చ జరుగుతోంది.

More in TG