ఎమ్మెల్యే వరుపుల దుర్గాదేవి దర్శనం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడిలో దుర్గాదేవి అమ్మవారిని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా దర్శించుకున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.



