పశువులకు మేతగా మారుతున్న పంటలు
TG : నల్గొండ జిల్లా వ్యాప్తంగా కరెంట్ కోతలు, సాగు నీరు అందకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. చేతికి రావాల్సిన పంట ఎండిపోవడంతో రైతులు వేరే దారి లేక పశువుల మేతగా వదిలేస్తున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి మట్టిలో కలిసిపోయిందని, తీవ్రంగా నష్టపోయామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


