పంట నష్టం, ఉపాధి కరువైంది.. ఆదుకోవాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా రావికమతం మండలం నేరేడుబంధం గ్రామంలో పంటలు ఎండిపోవడంతో గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడులు నష్టపోయి అప్పుల పాలయ్యామని, తినడానికి తిండి లేక, ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ దుక్కి దున్ని వినూత్నంగా నిరసన తెలిపారు. నష్టపోయిన గిరిజన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని CPM జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు కోరారు.



