మట్టి వినాయకుడే.. పర్యావరణ హితం!

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. బజారు వీధిలో మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్లకార్డులు ప్రదర్శించారు. రసాయనాలతో తయారైన విగ్రహాలు నీటిలో కరిగితే పాదరసం, కాడ్మియం వంటి హానికర రసాయనాలు విడుదలవుతాయని నేతలు తెలిపారు. ఇవి జలచరాలను చంపుతాయని, మనుషుల్లో వ్యాధులకు కారణమవుతాయని హెచ్చరించారు. పర్యావరణ హితమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మీరు ఈసారి మట్టి గణనాథుడినే ప్రతిష్టించారా? అయితే ఫొటో, వార్త పంపండి.
