సందడిగా ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర స్టార్ట్ అయింది. మండపం నుంచి మహాగణపతి విగ్రహం సుమారు 50 మీటర్ల మేర ముందుకు కదిలింది. నిమజ్జనం కోసం ప్రత్యేక వాహనంపై విగ్రహాన్ని తరలిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే భక్తుల దర్శనాలను నిలిపివేసి, మండపం దగ్గర ఏర్పాట్లను తొలగించారు. ఖైరతాబాద్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ట్యాంక్‌బండ్ వైపు శోభాయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 12 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.



