← Back to news

కూటమికి ఓటుతో బుద్ధి చెప్పండి!

By SK.Gani· 17h ago· Gokavaram, Gokavaram, East Godavari
కూటమికి ఓటుతో బుద్ధి చెప్పండి!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులు రెడీ అవ్వాలని తోట శ్రీరాంజీ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గాదేలపాలెం, ఇటికాయలపల్లి గ్రామాల్లో మండల అధ్యక్షుడు పాటి రాంబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు కమ్మిల వీరబాబు, పిల్లి లక్ష్మణ్ అధ్యక్షతన ఈ మీటింగ్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని తోట శ్రీరాంజీ ఫైర్ అయ్యారు. బీసీలకు వెన్నుపోటు పొడిచారని, రుణాలు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మండిపడ్డారు. ఓటుతో బుద్ధి చెప్పే సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

More in Local