← Back to news

ప్రమోషన్ పేపర్స్ ఇవ్వాలని వెళ్లి.. మిస్సింగ్

By BK· 2d ago· శ్రీసత్యసాయి
ప్రమోషన్ పేపర్స్ ఇవ్వాలని వెళ్లి.. మిస్సింగ్

కొలిమిగుండ్లలో జేఈగా పనిచేస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చింత లక్ష్మణస్వామి కనిపించకుండా పోయారు. ఈ నెల 8న ప్రమోషన్ పేపర్స్ సబ్మిట్ చేయడానికి తిరుపతి వెళ్తున్నానని కారులో బయలుదేరిన ఆయన, ఇప్పటికీ తిరిగి రాలేదు. మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని, బంధువుల దగ్గర వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో భార్య లీలావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI రమేష్‌బాబు తెలిపారు.

More in Local